బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో సౌత్ అందాల భామ


త్రిషా, కాజల్, శ్రియ, సమంతా తరువాత మరో అందాల భామ హిందీలో అడుగుపెట్టబోతుంది. ఆ భామ ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా. అవును తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న తమన్నా ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా రీమేక్లో నటించబోతున్నట్లు సమాచారం. 1983లో జితేంద్ర మరియు శ్రీదేవి జంటగా వచ్చిన హిమ్మత్ వాలా సినిమాని రీమేక్ చేయాలని భావించారు. తమన్నా ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటిస్తుండగా సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

Exit mobile version