సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?

coolie

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా ‘కూలీ’ రెండో వీకెండ్‌లో కొంచెం మందగించినా, మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. రిలీజ్ అయిన 11 రోజుల్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 310 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. ఇందులో ఫస్ట్ వీక్‌లో రూ. 270 కోట్లు, తర్వాత నాలుగు రోజుల్లో మరో రూ. 40 కోట్లు రాబట్టింది.

అయితే, తమిళనాడులో మాత్రం ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా రూ. 155-160 కోట్లు రాబట్టాల్సింది. కానీ 11 రోజుల్లో వసూళ్లు రూ.135 కోట్లు వద్దే ఆగిపోయాయి. దీంతో ఈ సినిమా రూ.150 కోట్ల మార్క్ చేరడం కూడా కష్టమేనని అనిపిస్తుంది.

ఈ ట్రెండ్ రజనీకాంత్ సినిమాల్లో కొత్తది కాదు. ఆయన చేసిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా ఇదే తరహా ట్రెండ్ ఫాలో అయ్యాయి. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన కూలీ సొంతగడ్డపై కూడా ప్రభావం చూపకపోవడంతో తమిళ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version