బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మొదట 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమాను ఈ ఏడాది చివరికి మార్చారు.

ఇదిలా ఉండగా, బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ NBK111పై కూడా హైప్ పెరుగుతోంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 2న గ్రాండ్‌గా లాంచ్ చేసి, దసరా తర్వాత రెగ్యులర్ షూట్ ప్రారంభం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

వ్రిద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనుండగా, ఈ సినిమాను 2026 దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట.

Exit mobile version