సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’

Sundarakanda

నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘సుందరకాండ’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది.

రోహిత్ కెరీర్‌లో మరో కీలక చిత్రంగా ఇది నిలుస్తుందని టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇక సెన్సార్ కూడా పూర్తి కావడంతో ఈ సినిమా విడుదల కోసం చిత్ర యూనిట్ రెడీ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు న్యూ-ఏజ్ కథతో, ఎమోషనల్ టచ్‌తో మంచి అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Exit mobile version