కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘3BHK’ చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి మధ్య రిలీజ్ చేశారు. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జె అచర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నాయి. దీంతో ఈ సినిమా తాము అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. అయితే, ఈ చిత్రంపై తాజాగా క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చాట్ చేసిన ఆయన ఇటీవల తాను చూసిన సినిమాల్లో తనకు 3BHK బాగా నచ్చిందని ఆయన తెలిపారు.
దీంతో ఒక్కసారిగా ఈ సినిమాకు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయ్యే అవకాశం లభించింది. ఇక ఈ సినిమాను శ్రీ గణేష్ డైరెక్ట్ చేయగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేశారు.