హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ చిత్రంగా ‘సుందరకాండ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వ్రితి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానున్న నేపథ్యంలో హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
సుందరకాండ ఎలా మొదలైంది?
– మొదట ఈ కథ విన్నప్పుడు కంగారు పడ్డాను. కానీ బ్రో డాడీ లాంటి సినిమాలు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. వెంకటేష్ 30 సీన్స్ రాసి చూపించగా నాకు నచ్చాయి. సినిమా పూర్తిగా లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్.
మీ పాత్ర గురించి చెబుతారా..?
– 30 ఏళ్లు దాటినా కూడా కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతికే కాంప్లికేటెడ్ క్యారెక్టర్. అదే ఫన్ క్రియేట్ చేస్తుంది. క్యారెక్టర్ ఆర్క్ ఛాలెంజింగ్‌గా ఉంది.
ఈ సినిమా జానర్ ఏమిటి..?
– ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ, క్లీన్ ఫిల్మ్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ వెంకటేష్ గురించి..?
– చాలా సెన్సిబుల్ డైరెక్టర్. యూనిక్ కథని అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు.
ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్ అవుతుందా..?
– లియోన్ జేమ్స్ అందించిన పాటలు, బీజీఎం అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలోని ‘డియర్ ఐరా’ నా ఫేవరెట్ సాంగ్. సినిమాను స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన పనితనం మనకు కనిపిస్తుంది.
మీ తరువాతి ప్రాజెక్టులు ఏమిటి..?
– ‘సందురకాండ’ డైరెక్టర్ వెంకటేష్‌తోనే మరో లవ్ స్టోరీ ప్లాన్‌లో ఉంది.