పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు. పీరియాడిక్ ఎపిక్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి వచ్చే నెక్స్ట్ చిత్రం ‘ఓజి’ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
అయితే, పవన్ అభిమానులు ఖుషీ అయ్యేందుకు ఆయన నటించిన ఓ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ కానున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా ఏమిటి.. టికెట్ బుకింగ్స్ కావడం ఏమిటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రాన్ని ఆగస్టు 30న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ రేపు(ఆగస్టు 26) ప్రారంభిస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.