నెగిటివ్ షేడ్స్ తో రొమాంటిక్ హీరో.. !

దర్శకుడు అజ‌య్ భూప‌తి రెండో సినిమా మహాసముద్రం నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్తున్నాడు. అలాగే మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అయితే రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందట. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

Exit mobile version