80% టాకీ పూర్తి చేసుకున్న వెంకీ – మహేష్ సినిమా


టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ చిత్ర టాకీ పార్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 80% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సమంత పై చిత్రీకరించాల్సిన కొన్ని పాటలు మరియు సన్నివేశాలు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ మల్టీ స్టారర్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపించనున్నారు.

సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ చిత్రం కూడా ఒకటి మరియు ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version