సూర్య కిరణ్ దర్శకత్వంలో నటించనున్న తనీష్


దర్శకుడు సూర్యకిరణ్ మరియు హీరో తనిష్ త్వరలో ఒక ప్రేమ కథ చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని విజయదశమి నాడు మొదలుపెట్టనున్నామని తెలిపారు. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయని ప్రేమలో విభిన్న కోణాలను తాకుతూ ఈ చిత్ర కథ నడుస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో కథానాయిక మరియు ఇతర సాంకేతిక వర్గం విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. ఎడుపుగంటి శేషగిరి ఈ చిత్రాన్ని రామ్ ప్రియాంక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

Exit mobile version