సూర్య,కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మాట్రాన్” త్వరలో బ్రెజిల్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. తమిళ పరిశ్రమలో ఉన్న సమాచారం ప్రకారం బ్రెజిల్ లో రాబోయే వారం ఒక పాటను చిత్రీకరించాలని కేవి ఆనంద్ చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. కే వి ఆనంద్, సూర్య మరియు కాజల్ తో పాటు చిత్ర బృందం కూడా త్వరలో బ్రెజిల్ వెళ్లనున్నారు. మరొక పాటను యూరప్ లో చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ మధ్యనే సింగపూర్ లో విడుదల చేశారు. చాలా మంది అతిధులు, కాజల్ తో సహా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. నిజానికి ఈ చిత్రం పేరు “Maatran” కాని ఈ చిత్రం అవిభక్త కవలల మీద తెరక్కెక్కిస్తున్న కారణంగా ఈ చిత్ర పేరుని ఆంగ్లంలో “Maattrraan” అని మార్చారు. ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను బెల్లంకొండ సురేష్ కొనుగోలు చెయ్యగా సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.