బాలయ్యని డీ కొట్టనున్న సురేష్

గతంలో హీరోగా సినిమాలు తీసిన విలక్షణ నటుడు సురేష్ ప్రస్తుతం సహాయ నటుడి పాత్రలు మరియు విలన్ పాత్రలు చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రని సురేష్ పోషించారు. ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సురేష్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఆరు మంది విలన్లు ఉంటారు అందర్లో సురేష్ మెయిన్ విలన్ పాత్రని పోషించారు మరియు సినిమాలో ఆయన పాత్ర హైలైట్ అవుతుందని’ ఆయన అన్నారు.
రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకరమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఇటీవలే జరిగిగింది. ఈ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version