రొటీన్ లవ్ స్టొరీ విజయంతో మేఘల్లో తేలిపోతున్న సందీప్ కిషన్

రొటీన్ లవ్ స్టొరీ విజయంతో మేఘల్లో తేలిపోతున్న సందీప్ కిషన్

Published on Nov 27, 2012 1:30 AM IST


“రొటీన్ లవ్ స్టొరీ” చిత్రానికి వస్తున్న స్పందన చుసిన సందీప్ కిషన్ మేఘాల్లో తేలిపోతున్నారు. సోలో హీరోగా సందీప్ కి ఇది మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారీగా ఆశలను పెట్టుకున్నారు. ఈ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్నాక అయన ఇలా ట్వీట్ చేశారు “సోలో హీరోగా నా మొదటి చిత్రం మంచి విజయం సాదించింది చాలా ఆనందంగా ఉంది దాదాపుగా ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాము ఇప్పుడు రివ్యూలు చూస్తుంటే ఆనందంగా ఉంది” అని అన్నారు. ప్రచారంలో తరువాత స్థాయి త్వరలో మొదలు కానుంది ఇందులో చిత్రం బృందం రాజమండ్రి, విజయవాడ, భీమవరం, వైజాగ్, నిడదవోలు, తాడేపల్లి గూడెం మరియు గుంటూరు వంటి ఊర్లలోని కాలేజిలు మరియు ధియేటర్లను సందర్శించనున్నారు. తరువాత వీరి ప్రచారాన్ని నైజాంలో జరపుతారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా చాణక్య నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు