‘అల్లు అర్జున్’ క్రేజ్ కి మరో నిదర్శనం !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్. ముఖ్యంగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సోషల్ మీడియాలో బన్నీ ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ కి చేరింది.

అలాగే బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య కూడా 4.6 మిలియన్స్ కి చేరడం విశేషం. బన్నీ పేస్ బుక్ ఫాలోవర్స్ మరియు అతని పేజ్ లైక్స్ 13 మిలియన్ మార్క్ పైగా టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు నమోదు చేసిన మొట్టమొదటి దక్షిణ భారత హీరోగా బన్నీ నిలిచాడు.

ఇక బన్నీ నటించిన సినిమాలకు యూట్యూబ్ లో ప్రేక్షకులు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో కూడా అందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో బన్నీని ఓ అభిమాన సైన్యం ఫాలో అవుతుంది. టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో కూడా బన్నీకి అభిమాన సంఘాలు ఉండటం విశేషం.

అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో అందరు అభిమానులకి దగ్గరకు ఉంటూ తనకు సంబంధించిన విషయాలని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రానున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్నాడు.

Exit mobile version