ఒక సిని తారను తన పేరుతో కన్నా తను నటించిన పాత్ర పేరుతోనే జనం గుర్తు పడతారు ఈ విషయాన్ని తాప్సీ బాగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే తనకి చిత్రంలో చేసే కథానాయకుడు మరియు కథ మాత్రమే ముఖ్యం అని అంటున్నారు ” మాములుగా జనం నన్ను చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అని అడుగుతుంటారు నేను చిత్రం చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది రెమ్యునరేషన్ చూసి కాదు హీరో మరియు కథను చూసి మాత్రమే నిర్ణయం తీసుకుంటాను. ఇది చాలా ముఖ్యమయిన విషయం ఇది ఎవరు మరిచిపోకూడదు” అని అన్నారు. ఈ నటికి ఇప్పటికి సరయిన కమర్షియల్ విజయం దక్కలేదు ఈ విషయం గురించి అడుగగా ” ఒక చిత్రం విజయం సాదిస్తుందా లేదా అన్నది ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? నేను ఒక చిత్రం ఒప్పుకున్నాను అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ఒకసారి చిత్రం విడుదలయ్యాక నేను మరో చిత్రం మీద దృష్టి సారిస్తాను” అని అన్నారు. తాప్సీ త్వరలో “షాడో” మరియు ” గుండెల్లో గోదారి” చిత్రాలలో కనిపించనున్నారు. ఈ చిత్రాలు తనకి విజయ చేకూర్చాలని ఆశిద్దాం.