సౌత్ సినిమాల పై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సినీ వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా మై టిక్ టాక్ స్టోరీ అంటూ ఇప్పటివరకూ చేసిన వీడియోలకు సంబంధించిన ఫుటేజ్ లో కొన్ని షాట్స్ కలిపి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘తమ ఆలోచనలతో సహాయం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను’ అని మెసేజ్ చేశాడు. కాగా ఈ వీడియోలో వార్నర్ తో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం పాల్గొన్న షాట్స్ అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి.
పైగా తన భార్యతో పిల్లలతో కలిసి డ్యాన్సులు వేసి. అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్, ఈ స్టార్ క్రికెటర్ వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. అదే జోష్‌ను టిక్ టాక్ పై కూడా కనబరుస్తున్నాడు వార్నర్. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు సాంగ్స్ కి మరియు డైలాగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.