బిగ్ బాస్ 4- హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సుమ కనకాల…వస్తూనే పంచ్ ల వర్షం

నేడు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద సంచలనం నమోదు కానుంది. తొమ్మిది వారల తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్ట్ ద్వారా స్టార్ యాంకర్ సుమ కనకాల ఎంటర్ అవుతున్నారు. కాసేపటికి క్రితం స్టార్ మా ఈ విషయాన్ని ప్రోమో ద్వారా తెలియజేసింది. రెడ్ డ్రెస్ లో మైక్ పట్టుకొని లగేజి పట్టుకొని సుమ వచ్చేశారు. రావడంతోనే ఇంటిలోని సభ్యులందరిపై పంచ్ ల వర్షం కురిపించారు సుమ. అరియానా, అవినాష్, సోహైల్ లను ఇమిటేట్ చేశారు. ఇక లాస్యది కవరింగ్ లాఫ్ అని చిన్న ఝలక్ ఇచ్చారు. చివరికి నాగార్జున పైన కూడా జోక్స్ వేయడంతో ఆయన హౌస్ నుండి వెళ్ళిపోతున్నా అని చమత్కరించారు.

ఇక సుమ వయసుపై అవినాష్, నాగార్జున పంచ్ లు బాగా పేలాయి. బిగ్ బాస్ తాజా సీజన్ కి సరైన ఆదరణ లేదని వార్తలు వస్తుండగా, స్టార్ యాంకర్ సుమను రంగంలోకి దింపి నిర్వాహకులు ప్రేక్షకులకు ఆసక్తి రేపారు. స్టార్స్ కి సమానమైన పాపులారిటీ కలిగిన సుమ హౌస్ లో ఎంతగా ఎంటర్టైన్ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. నేటి ఎపిసోడ్ లో నాగార్జున సుమకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఇంటిలోకి పంపారు. ఇంటి సభ్యులు సైతం సుమ రాకను ఆస్వాదిస్తున్నట్లు కనబడుతుంది. సుమ లాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్ ఉన్న కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లడం వలన ఎన్ని సంచలనాలు జరగనున్నాయో చూడాలి.

Exit mobile version