నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘ శ్రీమన్నారాయణ’ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో న్యాయం కోసం ఎంతటి సాహసానికైనా సిద్దపడే జర్నలిస్ట్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్ర దర్శకుడు రవికుమార్ చావాలి తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. ఎల్లో ఫ్లవర్స్ మూవీ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రం యొక్క ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఆగష్టు 26న జరగనుంది. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. రవి కుమార్ చావాలి మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో బాలయ్య బాబు చేసిన యాక్షన్ సన్నివేశాలు మరియు ఆయన చెప్పిన డైలాగ్స్ సినిమాకి హైలైట్ అవుతాయని’ ఆయన అన్నారు. రవికుమార్ చావాలి గతంలో తీసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోని ఒక పత్రికా జరనలిస్ట్ గా చూపించారు. అలాగే ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో హీరోని(బాలకృష్ణ) ప్రభుత్వంతో న్యాయం కోసం పోరాడే టీవీ జర్నలిస్ట్ గా చూపించనున్నారు.