‘ఆచార్య’ ఇంకాస్త ఆలస్యం అవుతుందట


మెగాస్టార్ చిరంజీవికి త్వరలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేస్తారనే వార్తలతో అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ ఇంతలోపే సినిమా ఇంకొన్ని రోజులు వాయిదాపడిందనే వార్తలు వారి ఉత్సాహాన్ని నీరుగార్చాయి. చిరు అప్పుడిప్పుడే సెట్స్ మీదకు రారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ ముగిశాక షూట్ పెట్టుకోవాలని భావిస్తున్నారట. కారణం సినిమా సెకండాఫ్ స్క్రిప్ట్ నందు ఏవో కొన్ని మార్పులు ఉన్నాయట. వాటి మూలంగానే ఈ ఆలస్యమని తెలుస్తోంది.

తొందరపడి అసంతృప్తిగా ఉన్న స్క్రిప్ట్ తోటి షూటింగ్ చేసేబదులు కొద్దిగా ఆలస్యమైనా ఖచ్చితమైన, నమ్మకమైన స్క్రిప్ట్ పెట్టుకుని రంగంలోకి దిగితే బాగుంటుందని కొరటాల శివ, చిరులు భావిస్తున్నారట. అందుకే ఇంకొంత సమయం తీసుకుని కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ ఆలస్యం కొంత నిరుత్సాహానికి గురిచేసినా మంచి ఔట్ ఫుట్ కోసమే సమయం వెచ్చిస్తున్నారు కాబట్టి సర్దుకుపోవాల్సిందే. అయితే అభిమానులు మాత్రం షూటింగ్ ఆలస్యమైనా విడుదల మాత్రం అనుకున్న సమయానికే చేస్తే బాగుంతుందని భావిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా మీద చిరు చాలా అంచనాలే పెట్టుకున్నారు. ముందుగా ఒప్పుకున్న సినిమాలను సైతం పక్కనపెట్టి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రామ్ చరణ్ కూడ ఒక ప్రముఖ పాత్ర చేయనున్నారు. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version