విడుదలకు సిద్ధమైన ‘ఎస్ఎమ్ఎస్’

విడుదలకు సిద్ధమైన ‘ఎస్ఎమ్ఎస్’

Published on Feb 7, 2012 10:21 AM IST


ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో సుదీర్ బాబు. ‘ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి గాను యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎమ్ఎస్ చిత్రం ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది. సెల్వ గణేష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గతంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’ అనే చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాతినేని సత్య దర్శకత్వం వహించారు. రేజీనా హీరొయిన్ గా నటించగా రొమాటిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కింది. ఈ చిత్రం తమిళంలో వచ్చిన ‘శివ మనసుల శ్రుతి’ చిత్రానికి రిమేక్ గా రూపొందింది.

తాజా వార్తలు