నటి శ్వేతా బసు ప్రసాద్ కొత్త అవతారం ఎత్తనున్నారు. కొన్ని తెలుగు చిత్రాలలో నటించిన అనంతరం ఆమె తెరపై కనిపించలేదు. ఐతే ఆమె మాత్రం మూడు సంవత్సరాల నుంచి ఓ ప్రాజెక్ట్ లో బిజీగా ఉంది.
భారత దేశ సాంప్రదాయ సంగీతం పై ఆమె ‘రూట్స్’ పేరు తో ఓ డాక్యుమెంటరీ ని తెరకెక్కిస్తున్నారు. భారత సాంప్రదాయ సంగీతానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచడానికి ఈ డాక్యుమెంటరీ ని నిర్మిస్తున్నట్లు శ్వేతాబసు ప్రసాద్ తెలిపారు. తాను కూడా సితార ను నేర్చుకున్నానని తెలిపిన ఆమె తాను తీయబోయే డాక్యుమెంటరీ ద్వారా యువతలో మార్పు తెగలని ఆమె భావిస్తున్నారు.
కాగా ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ని భారత సాంప్రదాయ సంగీతంపై అవగాహాన కల్పించడానికి దేశ వ్యాప్తంగా పలు స్కూల్స్, కాలేజీ లలో దీనిని చూపించడానికి శ్వేతా బసు ప్రసాద్ సిద్దమౌతున్నారు.