కలరి ఫైట్స్ చేస్తున్న శ్రియ సరన్


ప్రస్తుతం శ్రియ సరన్ రూప అయ్యర్ దర్శకత్వంలో కన్నడ మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘చంద్ర’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం శ్రియ సరన్ కలరి ఫైట్స్ చేసింది. ఈ విశేషాలను గురించి శ్రియ తెలియజేస్తూ ‘ ‘చంద్ర’ సినిమాకోసం నిన్ననే ఒక అందమైన దేవాలయంలో చిత్రీకరించిన కలరి ఫైట్ సన్నివేషాల చిత్రీకరణలో పాల్గొన్నాను. ఈ ఫైట్ లో వాడిన కత్తులు మరియు కాస్ట్యూమ్స్ చాలా బరువుగా ఉండడం వల్ల ఇప్పటికీ కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నాకు మరియు ప్రేమ్(కో స్టార్)కి మధ్య జరిగే ఈ యాక్షన్ సన్నివేశాలను రూప అయ్యర్ (దర్శకురాలు) ఎంతో బాగా చిత్రీకరించారని’ తన ట్విట్టర్లో పేర్కొంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో శ్రియ కెరీర్ గత నాలుగు సంవత్సరాలకంటే ప్రస్తుతం బాగుంది. ఒక యువరాణిగా పుట్టి పెరిగిన యువతి సాధారణ జీవితాన్ని గడపడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్నదే ‘చంద్ర’ చిత్ర కథాంశం. ఇప్పటి వరకూ ఎక్కువగా తన గ్లామర్ తోనే ఆకట్టుకున్న శ్రియకి ఈ చిత్రంతో తనలోని నటనని నిరూపించుకునే అవకాశం లబించింది. ఈ చిత్రం కాకుండా శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మరియు దీప మెహత దర్శకత్వం వహించిన ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ చిత్రాలతో శ్రియ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే చిత్రాలైనా బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ గా నిలిచి శ్రియకి అదృష్టాన్ని తెచ్చి పెడతాయా? అనే దానికోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version