అక్కినేని నాగార్జున నటిస్తున్న మరో భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’. ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఈ చిత్రంలో శిరిడి సాయి చిన్నతనం నుండి ఆయన జీవ సమాధి అయ్యేంత వరకూ జరిగిన ఆయన జీవిత విశేషాలను చూపించారు. శ్రీకాంత్, శ్రీ హరి, శరత్ బాబు మరియు చాలా మంది సీనియర్ నటులు ఈ చిత్రంలో నటించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎ. మహేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున మరియు రాఘవేంద్ర రావు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’.