SSMB29: సెన్సేషనల్ రిలీజ్ ప్లానింగ్? ఏకంగా 120 దేశాలు

SSMB29

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న గ్లొబ్ ట్రాటింగ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎనలేని హైప్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నుంచి రానున్న నవంబర్ లో బిగ్ అప్డేట్ ఆల్రెడీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంకో క్రేజీ రూమర్ ఇపుడు వైరల్ గా మారింది. ఈ సినిమాకి హాలీవుడ్ రేంజ్ సినిమాల తరహా రిలీజ్ దక్కినట్టు తెలుస్తుంది. ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా విడుదల చేయని విధంగా ఏకంగా 120 దేశాల్లో మహేష్ 29వ చిత్రం విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. ఇది మాత్రం నిజం అయితే ఒక సెన్సేషనల్ రికార్డు రిలీజ్ అని చెప్పాల్సిందే. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version