పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజి’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ యూకేలో ప్రారంభమయ్యాయి. అక్కడి థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు ఉత్సాహంగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం, యూకేలో బుకింగ్స్ ప్రారంభం కావడం ద్వారా సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మంచి ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్లనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇప్పటికే యూఎస్‌లో మిలియన్ డాలర్ మార్క్‌కు దగ్గరగా ఉండటంతో, యూకేలోనూ అదే స్థాయిలో దూసుకెళ్లడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మాస్ ఆడియన్స్‌తో పాటు ఓవర్సీస్లోనూ భారీ రెస్పాన్స్ వస్తుందని ఇప్పటికే స్పష్టమైంది.