తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఊహించినా, ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. వీక్ రైటింగ్ కారణంగా ఈ చిత్రానికి అనుకున్న స్థాయి కలెక్షన్స్ రాలేదు.
రజనీకాంత్‌తో పాటు సౌబిన్ షాహిర్, రచితా రామ్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో పొందింది. దీంతో ఈ నెల 11వ తేదీ నుంచి కూలీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.