సైలెంట్‌గా మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో రౌడీ స్టార్ నెక్స్ట్ చిత్రం ఎప్పుడు మొదలు పెడతారా అని అందరూ అనుకున్నారు.

అయితే, ఆయన ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ‘టాక్సావాలా’ ఫేం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మెజారిటీ షూటింగ్ జరుపుకుని, ఆ తర్వాత రాయలసీమలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని.. పీరియాడిక్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Exit mobile version