పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ అలాగే క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో చేసిన భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు”.ఒక ఫిక్షనల్ కథగా క్రిష్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఎన్నో ఏళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చింది. అయితే తాను అనుకున్న స్క్రిప్ట్ ఒకటి అని విడుదలైన పార్ట్ 1 ఒకలా ఉందని తాను ఆ మధ్య తెలిపారు.
రీసెంట్ గానే తాను ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అనేది కూడా రివీల్ చేశారు. ఇక లేటెస్ట్ గా అయితే తాను తెరకెక్కించిన సన్నివేశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. తాను తీసిన చాలా సన్నివేశాలు పార్ట్ 1 లో లేవని చెప్పారు.
నెమలి సింహాసనం, ఇంకా కోహినూర్ పై అద్భుతమైన సన్నివేశాలు అలాగే వీరమల్లు ఆ వజ్రాన్ని కొట్టేయడం ఇంకా ఔరంగజేబు నడుమ పలు ఆసక్తికర సన్నివేశాలు తీసినట్టు తెలిపారు. అయితే ఆ సీన్స్ పార్ట్ 2 లో ఉంటాయని ఆశిస్తున్నట్టుగా తాను తెలిపారు. దీనితో ఇది విన్న ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు కానీ ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా అని నిట్టూరుస్తున్నారు.