అక్కడ మొదలైన ”కోతి కొమ్మచ్చి” ఆట!

లెజెండరీ హీరో స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి , ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ “మా కోతి కొమ్మచ్చి చిత్రం ఈరోజు నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నేటి నుండి రెండు వారాల పాటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు , హీరోయిన్లలతో పాటు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ మిగతా తారాగణంపై కొన్ని కీలక సన్నివేషాలు చిత్రీకరించబోతున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో మిగతా సన్నివేశాలు తీయనున్నాము. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు.

అలాగే ఈ చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ” ఈరోజు నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న మా సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సతీష్ గారు యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలతో క్వాలిటీ సినిమాగా ‘కోతి కొమ్మచ్చి’ ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, సాహిత్యం : శ్రీమణి, ఆర్ట్ : రామంజనేయులు, ఎడిటింగ్ : మధు, పి.ఆర్.ఓ : రాజేష్ మన్నె లు అందిస్తున్నారు.

Exit mobile version