షూటింగ్ లకు సిద్దమైన సమంత


చాలా కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఈ రోజు నుంచి నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారని సమాచారం. ఈ సున్నితమైన ప్రేమ కథా చిత్రంలో సిద్దార్థ్ మరియు సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సమంత గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది అందువల్ల తను నటిస్తున్న చాలా సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం తను మళ్ళీ చిత్రీకరణలో పాల్గొంటోంది అని వినగానే తనతో సినిమా చేస్తున్న వారంతా హమ్మయ్య సమంత వచ్చేసింది అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

Exit mobile version