సిద్దార్థ్ ని ముంబై హీరోస్ కి ఆడమని కోరిన సల్లూ భాయ్

సిద్దార్థ్ ని ముంబై హీరోస్ కి ఆడమని కోరిన సల్లూ భాయ్

Published on Nov 28, 2012 11:05 PM IST

క్రికెట్ మీద సిద్దార్థ్ కి ఉన్న ఇష్టానికి ప్రత్యేకంగా పరిచయం లేదు డెక్కన్ ఛార్జర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు. షూటింగ్లో ఉన్నా సరే ఇంటర్నేషనల్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకుంటూ వాటి గురించి ట్విట్టర్లో మాట్లాడుతూ ఉంటారు. ఈ నటుడికి ఆశ్చర్యకరమయిన సంఘటన ఎదురయ్యింది, బాలివుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వయంగా సిద్దార్థ్ కి ఫోన్ చేసి రాబోయే ఏడాది జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ముంబై హీరోస్ తరుపున ఆడాలని కోరారు. ఈ విషయాన్ని సిద్దార్థ్ ట్విట్టర్లో స్వయంగా చెప్పారు. అంతే కాకుండా బెంగుళూరు మరియు హైదరాబాద్ జట్లు కూడా సిద్దార్థ్ ని వారి టీం కి ఆడమని అడిగారు కాని సిద్దార్థ్ ప్రస్తుతం ఆడే పరిస్థితిలో లేరు గత కొద్ది రోజులుగా అయన భుజం గాయానికి చికిత్స తీసుకుంటున్నారు డాక్టర్ల సలహా మేరకు ఈయనకి క్రికెట్ కొద్దినెలల పాటు క్రికెట్ కి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అయన నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు త్వరలో మరిన్ని చిత్రాలలో నటించడమే కాకుండా నిర్మించడానికి కూడా సిద్దమయ్యారు.

తాజా వార్తలు