రీ – రికార్డింగ్ జరుగుతున్న ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’

రీ – రికార్డింగ్ జరుగుతున్న ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’

Published on Sep 25, 2013 11:18 PM IST

Emo-Gurram-Eguravachu
సుమంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’. ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రీ – రికార్డింగ్ కార్యక్రమాలు అలాగే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని నవంబర్ లో విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎస్.ఎస్. కంచి స్క్రిప్ట్ ను అందించాడు. థాయ్ నటి పింకి సవిక ఈ సినిమాలో హీరొయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె మొదటిసారిగా ఇండియన్ సినిమాలకి పరిచయం అవుతోంది.ఈ సినిమాని మంచి ఎమోషనల్, ఫ్యామిలీ సన్నివేశాలతో చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు