సెన్సేషన్ కి, వివాదాలకి కేంద్ర బిందువైన రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక్కో సారి ఒక్కోలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం అతని ట్వీట్స్ తో పవన్ కళ్యాణ్ ని పొగిడాడు. అలాగే ఒకటి రెండు సార్లు పవన్ ని విమర్శించాడు కూడా, అది కూడా మోడీని కలిసి వచ్చాకనే..
తాజా ఈ రోజు వర్మ జన సేన పార్టీ పొలిటికల్ బైబిల్ లా భావిస్తున్న పవన్ కళ్యాణ్ రాసిన ‘ఇజం’ బుక్ ని టార్గెట్ చేసాడు. ‘నేను ఇజం బుక్ ని చదవడానికి ట్రై చేసాను. నాకో అనుమానం ఈ బుక్ రాసిన రైటర్ అన్నా అర్థం చేసుకోగలడా.. పవన్ కళ్యాణ్ ఈ బుక్ ని సింపుల్ వెర్షన్ గా మార్చి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నానని’ ట్వీట్ చేసాడు.
నిజంగానే ‘ఇజం’ బుక్ చదవడానికి కష్టంగా ఉందా? లేక ఎప్పటిలానే ఈ ప్రస్తుత టాపిక్ ని కాష్ చేసుకోవడానికి అలా అన్నాడా? అనే అనుమానం కూడా ఉంది. ఒక వేల రెండూ అయ్యే అవకాశం కూడా ఉంది.