సోమాజిగూడలో రెబల్ షూటింగ్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబల్’ ప్రస్తుతం సోమాజిగూడలో షూటింగ్ జరుపుకుంటుంది. సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లోని ఒక అపార్ట్మెంట్లో ఈ చిత్రానికి సంభందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తమన్ ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో సంగీత దర్శకుడి భాద్యతలు కూడా లారెన్స్ మోస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో కూడా ఈ నెలాఖరు వరకు విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన వస్తుంది.

Exit mobile version