ఈ రోజు విడుదల కానున్న ‘రెబల్’ ఫస్ట్ టీజర్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం యొక్క ఫస్ట్ టీజర్ ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం హోటల్ తాజ్ లో జరగనుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫోటోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ‘రెబల్’ మూవీ యాక్షన్ మరియు డ్రామా కలగలిపిన మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిందారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా కనిపించనున్నారు.

సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం కూడా రాఘవ లారెన్స్ గారే అందించారు. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చాలా కాలం చిత్రీకరణలో ఉండటం వల్ల ఈ చిత్ర బడ్జెట్ పెరిగిపోయింది, కానీ ఈ చిత్రం బాగా రావడం మరియు రిలీజ్ కు ముందే మంచి బుజినెస్ జరుగుతుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చాలా సంతోషంగా ఉన్నారు.

Exit mobile version