రవితేజకు నిజంగానే క్రాక్ అనేలా ఉంటాడట

మాస్ మహారాజ రవితేజ చేస్తున్న చిత్రాల్లో ‘క్రాక్’ కూడా ఒకటి. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నారు. ‘క్రాక్’ టైటిల్ చూసిన ప్రేక్షకులు పాత రవితేజను చూడవచ్చని భావిస్తున్నారు. చిత్ర సన్నిహిత వర్గాల మేరకు రవితేజ ఇందులో రవితేజ పాత్ర నిజంగానే క్రాక్ అనేలా ఉంటుందట.

ఒకరకంగా చెప్పాలంటే ‘కిక్’ సినిమాలో రవితేజ తరహా పాత్రలా ఉంటుందట. అంటే ఫుల్ ఎనర్జీతో కథను ఆద్యంతం రక్తికట్టించేలా ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించనుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు మంచి హోప్స్ పెట్టుకున్నారు.

Exit mobile version