దరువు విడుదల తేదీ వాయిదా


మాస్ మహారాజ రవితేజ సోషియో ఫాంటసి చిత్రం ‘దరువు’ మే 18న విడుదల కావాల్సి ఉండగా మరో వారం వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే నెల 25వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై భారీ కలెక్షన్లతో నడుస్తుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. యమలోకంలో ఆధారంగా సోషియో ఫాంటసిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు ప్రభు యమధర్మరాజుగా నటిస్తుండగా తాప్సీ కథానాయికగా నటిస్తుంది. విజయ్ అంటోనీ సంగీతం సమకూర్చగా బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version