తన ‘బలుపు’ రుచి చూపిస్తానంటున్న రవితేజ


మాస్ మహారాజ రవితేజ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘బలుపు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘డాన్ శీను’ అంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు’, పరుశురాం డైరెక్షన్లో రానున్న ‘సారోస్తారా’ చిత్రాలు పూర్తయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. గోపీచంద్ మలినేని ఇటీవలే వెంకటేష్ తో ‘బాడీగార్డ్’ అనే సినిమా తీసి ప్రశంసలు అందుకున్నాడు.

Exit mobile version