తనని తాను మార్చుకోవాలనుకుంటున్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ ఒకప్పుడు మినిమం గ్యారంటీ సినిమాలు తీసే హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. రవి సినిమాలన్నీ మంచి క్వాలిటీగా ఉండటమే కాకుండా మంచి కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టేవి. రవితేజ సినిమాలను సినీ నిర్మాతలు మరియు సినీ అభిమానులు బాగా ఇష్టపడేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి అది మారిపోయింది, ఈ మధ్య కాలం నుంచి రవితేజ వరుస పరాజయాలను చవి చూస్తున్నారు.

రవితేజ స్క్రీన్ మీద ఒకే రకమైన పాత్రలు చేస్తున్నాడని, అదే అతని సినిమాలు హిట్ కాకపోవడానికి గల ముఖ్య కారణమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఈ వార్త పై రవితేజ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది మరియు రవితేజ కూడా తనని తాను కొత్త రకంగా ఎలా చూపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ – పరశురాం కాంబినేషన్లో వస్తున్న ‘సార్ ఒస్తారు’ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. రవితేజ తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం కొత్త రకమైన కథలను మరియు వైవిధ్యమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు.

త్వరలోనే రవితేజ కొత్త రకమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని మరియు తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుని టాలీవుడ్ మాస్ మహారాజగా వెలుగొందాలని కోరుకుందాం.

Exit mobile version