నరకంలో అలజడి సృష్టించనున్న రవితేజ


మాస్ మహారాజ రవితేజ త్వరలో రానున్న ‘దరువు’ సినిమాలో ఐదు విభిన్నమైన పాత్రలతో అలరించనున్నాడు. రెగ్యులర్ గా రవితేజ సినిమాల్లో ఉండే వెటకారం, హాస్యం అన్ని కలగలపుతూ శౌర్యం శివ ఈ పత్రాలను తీర్చిదిద్దినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రాన్ని పోలి ఉంటూ యమలోకంలో తమిళ నటుడు ప్రభు మరియు రవితేజ, ఎమ్.ఎస్ నారాయణ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని సమాచారం. అలాగే మినిస్టర్ పాత్ర కూడా ఒకటి ఉంటుందనీ, విద్యా బాలన్ పాత్రలో బ్రహ్మానందం సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు. విజయ్ అంటోనీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతుంది.

Exit mobile version