నిఖిల్ మరియు స్వాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ స్వామి రా రా ‘ చిత్రంలో విలక్షణ నటుడు మరియు విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. చక్రి చిగురుపతి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ ‘స్వామి రా రా’ చిత్రంలో రవి బాబు గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రవిబాబు గారు నాటన్ పరంగా మరియు సాంకేతిక విలువల పరంగా ఎన్నో తెలిసిన వ్యక్తి, ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నానని’ నిఖిల్ ట్వీట్ చేసారు. హిందీలో వచ్చిన ‘ఢిల్లీ బెల్లీ’ చిత్రంలాగే ఇది కూడా క్రైమ్ మరియు కామెడీ కలగలపిన సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరికొత్తగా కనిపించనున్నారు. సన్నీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.