తమిళ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రానా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇదివరకే తెలిపాము. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో నటించడానికి రానా ముంబైకి వెళ్లి , ఈ చిత్ర టీంతో కలిశారు. ఈ తమిళ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ తో పాటు నయనతార, తాప్సీ మరియు ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తునారు. ఈ చిత్రం 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రానా ఈ చిత్రం కాకుండా క్రిష్ దర్శకత్వంలో నయనతార కథానాయికగా నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఒన్గరం’ పేరుతో తమిళంలో కూడా విడుదల చేయనున్నారు.