హిందీలో సినిమాలు నిర్మిస్తా : రానా


టాలీవుడ్ యువ హీరో రానా తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రానా హిందీలో నటించిన మొదటి చిత్రం ‘దమ్ మారొ దమ్’ పర్వలేదనిపించాగా రెండవ ప్రయత్నంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ‘డిపార్ట్మెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రానా త్వరలో హిందీలో సినిమాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వెల్లడించాడు. బిజినెస్ మేన్ గా ఎంతో అనుభవం ఉన్న రానా నిర్మాణ రంగంలోకి దిగితే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రానా నటించిన నా ఇష్టం సినిమా ఇటీవలే విడుదలవగా ప్రస్తుతం ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు.

Exit mobile version