మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్న ‘నాయక్’ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఆగష్టు 20 నుండి రామ్ చరణ్ మరియు కాజల్ అగర్వాల్ మీద కొన్ని కీలక సన్నివేశాలను గ్రీస్ లో చిత్రీకరించనున్నారు. అందుకోసం ఈ చిత్ర టీం త్వరలోనే గ్రీస్ కు బయలుదేరనుంది. గ్రీస్ లో ఈ షెడ్యూల్ 15 రోజులు జరగనుంది. ప్రస్తుతం కాజల్ సూర్య సరసన నటిస్తున్న ‘మాట్రాన్’ చిత్రం లోని ఓ పాట చిత్రీకరణలో భాగంగా నార్వేలో ఉన్నారు. అక్కడ షూటింగ్ పూర్తి కాగానే కాజల్ ‘నాయక్’ టీంతో వచ్చి కలుస్తారు. ఈ చిత్రానికి కథ – మాటలు ఆకుల శివ అందించగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ 2013లో వరుసగా తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2013 జనవరిలో నాయక్ విడుదలైన తర్వాత ఆయన నటిస్తున్న ‘జంజీర్’ మరియు ‘ఎవడు’ చిత్రాలు వెంట వెంటనే విడుదల కానున్నాయి.