ప్రియాంక చోప్రా కోసం కేర్ తీసుకుంటున్న ఉపాసన

ప్రియాంక చోప్రా కోసం కేర్ తీసుకుంటున్న ఉపాసన

Published on Nov 25, 2012 6:42 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘జంజీర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని ఇది వరకే తెలిపాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఉపాసన అపోలో హాస్పిటల్లో జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితమే ప్రియాంక చోప్రా ఈ మూవీ యూనిట్ తో జత కలిసారు. ప్రియాంక చోప్రా హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రియాంకకి కావాల్సిన అన్ని సదుపాయాలను మరియు తనకి హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రామ్ చరణ్ సతీమణి ఉపాసననే దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్న ‘జంజీర్’ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజా వార్తలు