మెగా హిట్ రచ్చ ఇచ్చిన ఉత్సాహంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తా చూపించాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ‘జంజీర్’ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టాలనుకుంటున్నాడు. రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమా పై చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గరలోని బాంద్రా ప్రాంతంలో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ కోసం ఇంట్లో చేసిన బిర్యాని కూడా పంపిన విషయం తెలిసిందే. చరణ్ ప్రస్తుతం అపూర్వ లఖియా డైరెక్షన్లో ‘జంజీర్’, వివి వినాయక డైరెక్షన్లో ‘నాయక్’ మరియు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘ఎవడు’ ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.