రామ్ చరణ్ తన రాబోతున్న చిత్రం “ఎవడు” లో అలరించబోతున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకేక్కబోతుంది. చాలా రోజుల తరువాత గత వారం నుండి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తెరకెక్కుతున్న విధానం మీద ఆయన కాస్త సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే రామ్ చరణ్ మరియు శ్వేతా భరద్వాజ్ ల మీద ఐటం సాంగ్ చిత్రీకరించారు. రామ్ చరణ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ” ఇప్పుడే ఎవడు చిత్రంలో ఐటం సాంగ్ చిత్రీకరణ జరిగింది ఈ పాట చూశాక మీరు ఆశ్చర్యపోతారు. దేవి శ్రీ ప్రసద్ కి ధన్యవాదాలు” అని ట్విట్టర్ లో తెలిపారు. సమంత మరియు ఏమి జాక్సన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించబోతున్నారు.అల్లు అర్జున్ ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.