బర్త్ డే నెంబర్స్ తో మేజిక్ చేస్తున్న రజినీకాంత్

బర్త్ డే నెంబర్స్ తో మేజిక్ చేస్తున్న రజినీకాంత్

Published on Nov 29, 2012 11:51 AM IST


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినిమాల్లో ఆసాధ్యమైన అన్నింటినీ చాలా సులువుగా చేసేస్తుంటారు. అతనికున్న క్రేజ్ తో తన సినిమాల్లో చేసే ఫీట్స్, నటన మరియు కామెడీతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఈ సూపర్బ్ హీరో తన రాబోయే పుట్టిన రోజు నాడు నెంబర్స్ తో మేజిక్ చేయనున్నాడు. రజినీ తన 62వ పుట్టిన రోజుని డిసెంబర్ 12న జేరుపుకోనున్నారు. ఇందులో పెద్ద విషయం ఏముంది అంటారా? ఈ బర్త్ డే 12-12-12 న రానుంది. ఇందులో మూడింటినీ కలిపితే 12+12+12=36 వస్తుంది. రజినీ సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 36 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 36ని తిప్పితే 63 అంటే ఈ సంవత్సరం రజినీ 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 63 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

రజినీ కుమార్తెలు ఐశ్వర్య మరియు సౌందర్య ఈ బర్త్ డే ని సంథింగ్ స్పెషల్ గా సెలెబ్రేట్ చేయాలనుకుంటున్నారు. వారి నుంచి రజినీ ఏమి గిఫ్ట్ అందుకుంటారు అనేది సస్పెన్స్ గా ఉంచారు కానీ ఖచ్చితంగా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని మాత్రం అంచనా వేయగలం. రజినీ మణిరత్నం డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రజినీకాంత్ చెయ్యలేనిది ఏమన్నా ఉందా? మీరేమంటారు ఫ్రెండ్స్.

తాజా వార్తలు