యూఎస్ మార్కెట్ లో ‘కూలీ’కి సెన్సేషనల్ స్టార్ట్!

Coolie Movie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ని పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకున్న ఈ సినిమాకి యూఎస్ బుకింగ్స్ రీసెంట్ గానే మొదలయ్యాయి. అయితే యూఎస్ మార్కెట్ లో ఒక సెన్సేషనల్ స్టార్ట్ తో సినిమా మొదలవుతుంది అని తెలుస్తుంది.

ప్రీమియర్స్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే

ప్రస్తుతానికి మొయ్యమ్ యూఎస్ఏ లో 110కి పైగా లొకేషన్స్ లో ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఏకంగా లెక్క ఆల్రెడీ లక్ష డాలర్స్ దాటి 1 లక్ష 20 వేలుకి చేరినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం ఒక సాలిడ్ స్టార్ట్ అని చెప్పవచ్చు.

రజినీ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలుస్తాయా?

తలైవర్ నటించిన జైలర్ చిత్రం యూఎస్ లో 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ప్రీమియర్స్ తో అందుకుంది. దానిని కూలీ ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

అనిరుద్ ఫ్యాక్టర్ బిగ్ ప్లస్

మన దగ్గర బాలయ్యకి థమన్ ఎలానో తమిళ్ లో రజినీకాంత్ కి అనిరుద్ క్రేజీ సంగీతం అందిస్తున్నాడు. తమ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలకి దాదాపు అనిరుద్ ఫ్యాక్టర్ చాలా ప్లస్ అయ్యింది. ఇపుడు కూలీ విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది.

Exit mobile version