టీజర్ టాక్.. సూర్య బర్త్ డే బ్లాస్ట్.. మాస్ ఫీస్ట్ ఇచ్చిన ‘కరుప్పు’

Karuppu

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “కరుప్పు”. సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేసిన సినిమా అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ని అందుకుంది. సూర్యని గత కొంత కాలం నుంచి మిస్ అవుతున్న ప్రాపర్ మాస్ డ్రామా ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్ అనిపించేలా తన బర్త్ డే కానుకగా విడుదల చేసిన టీజర్ చూసాక కనిపిస్తుంది.

సూర్య భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఒక అగ్రెసివ్ లాయర్ గా అందులో మాస్ షేడ్స్ ని సూర్య అద్భుతంగా చూపించేలా కనిపిస్తున్నాడు. మాస్ ప్లస్ అందులో ఎంటర్టైనింగ్ యాటిట్యూడ్ తో సూర్య చాలా కాలం తర్వాత మంచి ఎనర్జిటిక్ గా కనిపిస్తుండడం విశేషం. టీజర్ మొత్తం సూర్య పైనే తనకి మంచి ఎలివేషన్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. ఇక ఇందులో విజువల్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. సాయి అభ్యంకర్ స్కోర్ బానే ఉంది. ఓవరాల్ గా మాత్రం. ఫ్యాన్స్ కి ఈ బర్త్ డే ట్రీట్ అదిరింది అని చెప్పొచ్చు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version